మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Bhadragiri Pati Sri Rama Mangalasasanam – భద్రగిరిపతి శ్రీ రామచంద్ర మంగళాశాసనం
మంగళం కౌశలేంద్రాయ మహనీయగుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 ||
వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే |
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ || 2 ||
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ || 3 ||
పితృభక్తాయ సతతం భ్రాతృభి స్సహ సీతయా |
వందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్ || 4 ||
త్యక్తసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళమ్ || 5 ||
సౌమిత్రిణా చ జానక్యా చాపబాణసిధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్ || 6 ||
దండకారాణ్యవాసాయ ఖండితామరశత్రవే |
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళమ్ || 7 ||
సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే |
సౌలభ్యపరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళమ్ || 8 ||
హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే |
వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళమ్ || 9 ||
శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘితసింధవే |
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్ || 10 ||
విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినే |
సర్వలోకశరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్ || 11 ||
ఆసాద్య నగరీం దివ్యా మభిషిక్తాయ సీతయా |
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్ || 12 ||
భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే |
జానకీప్రాణనాథాయ రామచంద్రాయ మంగళమ్ || 13 ||
శ్రీసౌమ్యజామాతృమునేః కృపయాస్మానుపేయుషే |
మహతేమమనాథాయ రఘునాథాయ మంగళమ్ || 14 ||
మంగలాశాసనపరై ర్మదాచార్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృతాయాస్తు మంగళమ్ || 15 ||
రమ్యజామాతృమునినా మంగళాశాసనం కృతమ్ |
త్రైలోక్యాధిపతిశ్శ్రీమాన్ కరోతు మంగళం సదా || 16 ||
కాయేన వాచా మనసేంద్రియై ర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతీ స్స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || 17 ||
ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీ భద్రాద్రిరామ మంగళాశాసనం సంపూర్ణమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.